కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన రూ.7.98 కోట్లు విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్టు జిల్లా ఎక్సైజ్ అధికారి హన్మంత్ రావు(Excise Officer Hanmant Rao) తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం 1285.25 కేజీల ఎండు గంజాయి, 32.585 కిలోల అల్ట్రాజోలం, 71.845 కిలోల డైజోఫామ్, 114 గంజాయి మొక్కలు కాల్చి వేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు విజయ్ కుమార్, మధుసూదన్ రావు, షాకిర్ అహ్మద్, సత్యనారాయణ, ఎస్సై విక్రమ్ కుమార్, నగేష్, సిబ్బంది పాల్గొన్నారు.