calender_icon.png 4 October, 2024 | 12:59 AM

కాలిపోతున్న ఊపిరితిత్తులు

03-10-2024 12:28:04 AM

తగులబడుతున్న అమెజాన్ అడవులు

రియోడీజనీరో, అక్టోబర్ 2: భూమండలానికి ఊపిరితిత్తులుగా గుర్తింపు పొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ వర్షారణ్యాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవులు గత రెండు నెలలు గా ఏదో ఒక ప్రదేశంలో కాలిపోతూనే ఉన్నా యి. అడవుల నుంచి అగ్నిపర్వతాలు బద్దలైతే ఎగిసిపడినట్లుగా ఆకాశాన్ని తాకుతూ పొగలు వెలువడుతూనే ఉన్నాయి.

ప్రభు త్వం మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రావటం లేదు. దక్షిణ అమెరికా ఖండంలో పదేండ్లలో అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటంతో అడవులు పొడిబారి తగలబడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విస్తారమైన అడవుల్లో ఏకంగా 31,463 అగ్నిప్రమాద ప్రదే శాలను శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించిన ట్లు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది.

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఈ అడవుల్లో మం టల కారణంగా వెలువడిన పొగ దక్షిణ అమెరికా ఖండంలో సగం వరు వ్యాపించింది. ముఖ్యంగా పరసా రాష్ట్రంలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నది. గత 14 ఏండ్లలో అమెజాన్ అడవుల్లో ఇవే అత్యంత తీవ్రమైన అగ్నిప్రమాదాలని అధికారులు వెల్లడించారు.  

వాతావరణ మార్పులే కారణం

ఏడాదంతా పచ్చగా నిగనిగలాడుతూ ఉండే అమెజాన్ అడవులు ఇలా వేల ఎకరా ల్లో కాలిపోవటానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. కొంతకాలంగా అమెజాన్ ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణ మార్పులు వస్తున్నాయని, చిన్నచిన్న నదులు కూడా ఎండిపోతున్నాయని అంటున్నారు. మరోవైపు విలువైన ఖనిజాల కోసం స్మగ్లర్లు అమెజాన్ అడవులను విచక్షణారహితంగా నరికేయటం కూడా ఈ అగ్నిప్రమాదాలకు కారణమని పేర్కొంటున్నారు.

గ్రీస్‌లోనూ అదే పరిస్థితి

మధ్యదరా సముద్రం అంచుల్లో ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు స్వర్గధామంగా ఉండే గ్రీస్‌లోనూ అడవులు కాలిపోతున్నాయి. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వందల ఎకరాల్లో అడవులు అగ్నికి బుగ్గి అయిపోయాయి.