calender_icon.png 30 October, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లీకూతుళ్ల సజీవ దహనం

30-10-2024 01:32:05 AM

  1. షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఘటన
  2. వివరాలు వెల్లడించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్

మంథని, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ సంభ వించి, మంటలు వ్యాపించి తల్లీకూతు ళ్లు సజీవదహనమైన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ రాంనగర్‌లో చోటుచేసుకున్నది.

గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కల్వల పోచమ్మ (65), ఆమె కుమార్తె కొమురమ్మ (45) సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నా రు. అర్ధరాత్రి ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. మంటల్లో తల్లీకూతుళ్లతో పాటు వారి పెంపుడు కుక్క, కోడిపిల్లలు సైతం మృత్యువాత పడ్డాయి.

మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రమేశ్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు కొమురమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతికేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

విచారణలో మంథని సీఐ రాజు, ఎస్సై చంద్రకుమార్, ట్రాన్స్ కో ఏఈ పాల్గొన్నారు. తల్లీకూతుళ్ల మృతిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు స్పందించారు. మంత్రి శ్రీధర్‌బాబు సూచనల మేరకు అంత్యక్రియల ఖర్చులకు కుటుంబ సభ్యులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.