calender_icon.png 15 November, 2024 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో హైదరాబాదీల సజీవదహనం

05-09-2024 12:26:05 AM

  1. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి 
  2. మృతుల్లో ఇద్దరు నగరానికి చెందిన విద్యార్థులు 
  3. ఒకరు తమిళనాడుకు చెందిన యువతి

టెక్సాస్ (అమెరికా), సెప్టెంబర్ 4: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇందులో ముగ్గురు తెలంగాణకు చెందినవారు కాగా ఒకరు తమిళనాడుకు చెందిన ఒక విద్యార్థి ఉన్నాడు. ఈ నలుగురు విద్యార్థులు బెంటన్‌విల్లేకు ప్రయాణిస్తుం డగా వేగంగా వచ్చిన ట్రక్.. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరే గడంతో వారంతా అక్కడిక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. కారులోని నలుగురు ప్రయాణికులు కార్ పూల్ యాప్ ద్వారా కలిసి ప్రయాణిస్తున్నారు.

మృతుల్లో హైదరా బాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, అతని స్నేహితుడు ఫరూఖ్ షేక్ ఉన్నారు. లోకేశ్ కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. కాగా తమిళనాడుకు చెంది దర్శిని వాసుదేవన్ కూడా వీరిలో ఒకరు. డల్లాస్‌లో నివసించే సోదరుడి ఇంటి నుంచి ఆర్యన్ బెంటన్‌విల్లేకు తిరిగి వస్తున్నాడు. ఆర్యన్ తండ్రికి కూకట్‌పల్లిలో మ్యాక్స్ అగ్రి జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు.

లోకేశ్ తన భార్యను కలిసేందుకు బెంటన్‌విల్లేకు వెళుతున్నాడు. దర్శిని టెక్సాస్ వర్సిటీలో మాస్టర్స్ చేస్తోంది. ఆమె తన అంకుల్ ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. విద్యార్థుల మరణం పట్ల బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసి షాక్ గురైనట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.