- నెవడా, కాలిఫోర్నియాలో రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- వేల ఎకరాల అటవీ సంపద బూడిద
కాలిఫోర్నియా, సెప్టెంబర్ 9: అమెరికాలోని కాలిఫోర్నియా, నెవడా రాష్ట్రాల్లో కార్చి చ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో కౌంటీలో దాదాపు 20 వేల ఎకరాల్లో అటవీ సంపద కాలిపోయింది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు గవర్నర్ గవిన్ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచించారు. బేస్‌లైన్, అల్పిన్ వీధి వద్ద గురువారం రాత్రి పిడుగుపడడంతో మొదలైన కార్చిచ్చుకు గాలి తోడు కావడంతో తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం ౩వేల ఎకరాలు, శనివారం ౭వేల ఎక రాల అడవి కాలిపోయింది. దీనికి తోడు ఇక్క డ స్వల్ప భూకంపం సంభవించింది. కార్చిచ్చు కారణంగా హైవేలను, పాఠశాలలను మూసివేశారు. నెవడాలో దక్షిణ రెనో ప్రాంతంలో 6,500 ఎకరాల అడవి కాలిపోయింది.