calender_icon.png 18 January, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూమును పూడ్చి నిర్మాణాలు

01-09-2024 01:39:57 AM

పటాన్‌చెరువు సాకి చెరువులో గుర్తించిన హైడ్రా

పటాన్‌చెరు, అమీన్‌పూర్‌లో ఆక్రమణలను పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్

నక్క వాగు బఫర్ జోన్ ఆక్రమణపై ఫిర్యాదులు

సంగారెడ్డి, ఆగస్టు 31 (విజయక్రాంతి)/ పటాన్‌చెరు/శేరిలింగంపల్లి: చెరువుల ఆక్రమణలను గుర్తించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసి పటాన్‌చెరువులోని సాకి చెరువులో ఆక్రమణలను పరిశీలించా రు. స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు చెరువు పూర్వపు స్థితిని అడిగి తెలుసుకున్నారు. నక్కవాగును, అమీన్‌పూర్ మండల పరిధిలోని శంభునికుంట, శేంబికుంట, బందకొమ్ము, చక్రపురికాలనీ, అమీన్ పూర్ పెద్ద చెరువును పరిశీలించారు.

సాకి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా సుమారు 18 నిర్మాణాలు ఉన్న ట్టు గుర్తించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలపై ఆరా తీశారు. సాకి చెరువు ఎఫ్‌టీఎల్ 135 ఎకరా లు ఉంటుందని, పదుల ఎకరాల్లో కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కొందరు రియల్ వ్యాపారులు చెరు వు తూమును మూసివేసి నిర్మాణాలు చేపట్టినట్టు రంగనాథ్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన సాకి చెరువు పూర్తి రికార్డులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలతో పాటు చెరువు స్థలం ఎంత ఆక్రమణకు గురైందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చెరువు తూమును మూసివేసి ఇన్‌కోర్ సం స్థ నిర్మించిన అపార్టుమెంట్లను ఆయన పరిశీలించారు. అలాగే పటాన్‌చెరు నక్కవాగు బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. నక్కవాగు బఫర్‌జోన్‌పై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అమీన్‌పూర్‌లోని వెం కటరమణ కాలనీలో అక్రమ నిర్మాణాలను కూడా పరిశీలించారు.

ఈదులకుంట చెరువు పరిశీలన

రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్, ఖానామెట్ డివిజన్లలో ఉన్న ఈదులకుంట చెరువును కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈదులకుంట చెరువు కబ్జాకు గురవుతుందని సీపీఏం నాయకులు శోభన్, కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులపై స్పదించి శనివా రం స్వయంగా చెరువును పరిశీలించారు. చెరువు వివరాలతోపాటు కబ్జాకు గురైన ప్రాంతాలు, జరిగిన నిర్మాణాలపై రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కబ్జాదారుల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

రెవెన్యూ మ్యాపులను పరిశీలించి గతంలో చెరువు ఎంతవరకు విస్తరించి ఉంది? చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం ఎంత? అనే వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి మండలంలోనే చెరువులు అత్యధిక కబ్జాలు జరిగినట్లు తెలిసిందని, చెరువులను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. చెరువులు, కుంటలను ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.