calender_icon.png 28 December, 2024 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ రుణం పేరుతో బురిడీ

04-12-2024 01:03:54 AM

వృద్ధురాలి ఖాతా నుంచి రూ.4 లక్షలు మాయం

నిజామాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): లోన్ ఇప్పిస్తామని వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి ఆమె ఖాతా నుంచి రూ.4 లక్షలు కాజేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌గాజుల్‌పేట్‌కు చెందిన మున్సిపల్ కార్మికురాలు మల్లవ్వకు బ్యాంక్ రుణం ఇప్పిస్తానని శివ అనే వ్యక్తి నమ్మించాడు. ఆమె నుంచి పలు ధ్రువపత్రాలు తీసుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఆమె ఖాతా నుంచి రూ.4 లక్షలు అపహరించా డు. విషయం తెలుసుకున్న వృద్ధురాలు తన డబ్బు ఇవ్వాలని నిలదీ సింది. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.