న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని కంపాలాకు సమీపంలో ఉన్న ఓ చెత్తకుప్ప కూలటంతో 18 మంది సజీవ సమాధి అయ్యారు. కిటీజీ జిల్లాలోని డంప్‌యార్డు ఒక్కసారిగా కూలిపోవటంతో చెత్త కింద సమీపంలోని చాలా ఇండ్లు కప్పబడిపోయాయని అందులో మనుషులు, జంతు వులు కూడా కూరుకుపోయాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదం నుంచి 14 మందిని కాపాడి దవాఖానకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ భారీ చెత్తకుప్ప చుట్టూ ఇండ్లు ఉండటంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు.