calender_icon.png 16 January, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఏటీఎంలతో బురిడీ

16-01-2025 03:21:21 AM

* పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా

రాజేంద్రనగర్, జనవరి15: ఏటీఎం కేంద్రాల కాపుకాసి నిరక్షరాస్యులను నకిలీ ఎటీఎంలతో బురిడీకొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండలం శ్రీనివాసులుగూడెంకు చెందిన రాజు నిరక్షరాస్యుడు.

ఈనెల 5న మధ్యాహ్నం రాజు జడ్చర్ల రోడ్డులో ఐడీబీఎం ఏటీఎం సెంటర్ వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఎలా విత్‌డ్రాచేయాలో తెలియకపోవడంతో వెనుకాల నిలబడిన ఓ వ్యక్తి సాయం చేస్తానని ఆయన కార్డు తీసుకొని డబ్బులు రావడం లేదని మరో ఫేక్‌కార్డు ఇచ్చాడు. ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత కార్డులోంచి రూ.42,400 డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది.

అదేరోజు ఆయన ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 14వ తేదీ శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు, షాద్‌నగర్ పీఎస్ సిబ్బంది టెక్నికల్ ఆధారాల ద్వారా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

వీరు నిరక్ష్యరాస్యులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కేంద్రాల వద్ద ఒరిజినల్ కార్డులు తీసుకొని ఫేక్ కార్డులు ఇస్తూ తర్వాత డబ్బులు డ్రా చేస్తున్నట్లు విచారణలోతేలింది. వారి నుంచి రూ.3 లక్షల నగదు, 140 ఫేక్ ఏటీఎం కార్డులు, నాలుగు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు.

నిందితులు తొండుపల్లిలో లేబర్ పనిచేసుకుంటూ నివాసముంటున్న కారిమన్ సహాని, రూప్‌దేవ్ సహాని, సాహిబ్ సహానిగా గుర్తించారు. వీరు బీహార్, పంజాబ్‌కు చెందినవారిగా తేలింది.