నగల కోసమే మహిళ హత్య
పాత నేరస్తులే వీరు
డిఎస్పీ నాగేశ్వర్‌రావు
కామారెడ్డి (విజయక్రాంతి): మహిళ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు సోమవారం చేదించారు. మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహిళా హత్య కేసు నిందితుల వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్లలో ఈ నెల 20న వ్యవసాయ పోలంలో కూరగాయాలు తెంపుతున్న బాలెంల సుగుణ తలపై కొట్టి హత్య చేసి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన కేసులో అల్లెపు మల్లయ్య అనే నిందితుడు ఆత్మహత్య చేసుకొగా మిగితా నిందితులు నవీన్, ప్రసాద్, సాలవ్వలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ వెల్లడించారు.
నిందితులు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన వారన్నారు. వీరు గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన కేసుల్లో నిందితులు అని తెలిపారు. పోలీసులు విచారణ జరిపి సుగుణ హత్య కేసులో నలుగురు నిందితులు కాగా ఒకరు మల్లయ్య ఆత్మహత్య చేసుకోగా నవీన్, ప్రసాద్, సాలవ్వలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు చైన్‌తోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నట్లు డిఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో భిక్కనూర్ సీఐ సంపత్‌కుమార్, భిక్కనూర్ ఎస్సై, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.