calender_icon.png 6 February, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ఇండ్లలో చోరీ

06-02-2025 12:23:17 AM

చారకొండ, ఫిబ్రవరి 5: పట్టపగలే తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో దొంగలు చోరి చేసి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కాగుల శ్రీనయ్య భార్య ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్ళగా కూతురు కల్వకుర్తికి, కుమారుడు పాఠశాలకు వెళ్లారు.

మధ్యాహ్నం వచ్చి చూసుకునేసరికి ఇంటి తాళం, బీరువా తాళం విరగొట్టి ఉండటంతో కూతురు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న క్రమంలోనే మారుపాకుల యాదయ్య అనే వ్యక్తి ఇంటి తాళం విరగొట్టీ నల్లగొండ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి లోపలికి ప్రవేశస్తుండగా ఇంటి పక్కన వ్యక్తి చూసి అరవడంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

శ్రీను బీరువాలో దాదాపు 7.5 గ్రాముల బంగారం, రూ. 16 వేలు నగదు వుండగా దానిలో నగదు చోరికి గురైంది. రెండు ఇండ్లలో ఒకే వ్యక్తి దొంగతనం పాల్పడ్డడా లేక మరెవరైనా పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ నాగయ్య తెలిపారు.