01-04-2025 01:54:00 AM
వికారాబాద్ మార్చ్- 31 వికారాబాద్ లో దొంగల భీభత్సం రోజు రోజు కు పెరిగిపోతుంది. ఆదివారం రాత్రి వికారాబాద్ పట్ట ణం అలంపల్లి సినిమాక్స్ వెనకాల వీధిలో ఒకే రాత్రి మూడు ఇళ్లల్లో చోరీ చోటుచేసుకుంది. రంజాన్ సందర్బంగా తమ సొంత గ్రామానికి వెళ్లిన సమయం లో ముస్లిమ్ ల ఇళ్లల్లో దొంగలు చొరబడ్డారు.
ఒక ఇంట్లో రెండు తులాల బంగారం, 25వేల నగదు ఇతర విలువైన వస్తువులు పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన లు ఇదే ఏరియాలో జరిగాయి. వికారాబాద్ లో ఇలాంటి ఘటనలు తరచుగా పునరావృతం అవుతున్న పెద్ద గా పట్టించుకోవడం లేదు.