calender_icon.png 6 March, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైంసాలో పలు ఇళ్లలో చోరీ

06-03-2025 04:34:34 PM

బైంసా (విజయక్రాంతి): పట్టణంలోని ఓ కాలనీలో పలు ఇళ్లలో గుర్తుతెలియని దొంగలు బుధవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గోకుల్ నగర్ లో రాహుల్, శిరీష కుటుంబాలు బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు తాళాలు ఉన్న వారి ఇళ్లను గమనించి రాత్రికి వాటిని పగులగొట్టి విలువైన బంగారు వెండిఆభరణాలు, నగదు వివిధ వస్తువులు అపహరించారు.

అంతేకాకుండా అదే కాలనీలో పోలీస్ కానిస్టేబుల్ కు చెందిన మోటార్ సైకిల్ సైతం దొంగిలించి పారిపోయారు. అంతేకాకుండా ఓ ఇన్స్టిట్యూట్లో సైతం దొంగతనానికి యత్నించినట్లు తెలిపారు. గురువారం ఉదయం బాధితులు ఇళ్లకు చేరుకొని చూడగా దొంగలు తమ ఇళ్లలో దొంగతనానికి పాల్పడినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గోపీనాథ్ పేర్కొన్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.