calender_icon.png 19 January, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసిన ఇంట్లో చోరీ

05-07-2024 12:11:16 AM

పాపన్నపేట/కొండపాక, జూలై 4: పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కుర్తివాడకు చెందిన ముప్పారం గంగయ్య తన భార్య లింగవ్వతో కలిసి బుధవారం ఊరెళ్లాడు. గురువారం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. రూ.2 లక్షల నగదు, రెండు తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో మెదక్ రూరల్  సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  

కొండపాక మండలంలో.. 

కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో చోరీ జరిగింది. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కథనం ప్రకారం.. దుద్దెడకు చెందిన కాట శేఖర్ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి పొన్నాల గ్రామానికి వెళ్లారు. గురువారం ఉదయం ఇంటి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని రూ.50 వేల నగదు, 18 తులాల వెండి గొలుసులు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్‌టీమ్ సంఘటనా స్థలానికి వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.