calender_icon.png 3 March, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడువాయిలో రెండు ఇండ్లల్లో చోరీ

03-03-2025 01:50:28 AM

తాడ్వాయి, మార్చి ౨ ( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం రాత్రి రెండు ఇండ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన గడ్డల సావిత్రి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 5 మాసాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన శరత్ ఇంట్లో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ.5 వేల నగదును చోరీ చేశారు.

అదే గ్రామంలో రోడ్డు పక్కనే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న సురకంటి ప్రతాపరెడ్డి కి చెందిన బైకును ఎత్తుకెళ్లారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కురుమ తిరుపతి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన రూ 3 లక్షల నగదును చోరీ చేశారు.

గుర్తు తెలియ ని వ్యక్తులు పక్కా ప్రణాళికతో తాడ్వాయి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో చోరీలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు రాత్రి సమయంలో పకడ్బందీగా పోలీస్  పెట్రోలింగ్ చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. బందోబస్తు నిర్వహించాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే పక్కాగా రెండు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారని గ్రామస్తులు  ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి గుర్తు తెలియని దొంగలను పట్టుకొని పోయిన డబ్బులు, బంగారం రికవరీ చేయించాలని కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులు క్లూస్ టీం తో రెండు గ్రామాల్లో పరిశోధనలు ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాడువాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.