calender_icon.png 30 April, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడే

30-04-2025 12:39:18 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హామీ

బూర్గంపాడు, ఏప్రిల్29(విజయక్రాంతి):బూర్గంపాడులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇక్కడి నుంచి తరలిపోవడం లేదని... ఇక్కడే ఉంటుందని.. అవాస్తవాలను ఎవరు నమ్మవద్దని... పినపాక ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు అన్నారు. మంగళవారం బూర్గంపాడులో భూభారతి చట్ట అవగాహన కార్యక్రమంలో పా ల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ  బూర్గంపాడు లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికి తరలిపోవడం లేదని... ఇక్క డే ఉంటుందని... అవాస్తవాలను  ఎవరు న మ్మవద్దని ఆయన అన్నారు. అదేవిధంగా అక్క డే ఉన్న జిల్లా కలెక్టర్ జితేష్.వి. పాటీల్ కు ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాయం వివరించారు.ఆసుపత్రికి నిధులు ఉన్నాయని ఆ నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుందామని...

ఇంజనీర్లు వచ్చినప్పుడు స్థానికులు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనేక పేద ప్రజల వైద్యానికి అందుబాటులో ఉన్న ఈ ఆసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దు అని...

తాను ఎమ్మెల్యేగా చెబుతున్నాను ఇక్కడే ఆసుపత్రి ఉంటుంది... ఇక్కడే నూతన భవనాలను నిర్మించుకుందామ ని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ పార్టీ టౌన్ అధ్యక్షులు మందా నాగ రాజు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భజన సతీ ష్, కైపు శ్రీనివాసరెడ్డి, కేసుపాక మహేష్, చిప్పా రాజు, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.