ముంబై: టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను కట్టడి చేయగలిగితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలవడం సులభమని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. కమిన్స్ మాట్లాడుతూ.. ‘నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. అతడు అత్యద్భుతమైన బౌలర్ అని నా అభిప్రాయం. అతడిని కట్టడి చేయగలిగితే మేము సులభంగా గెలవొచ్చు. గత రెండు సిరీస్‌ల్లో ఓడిపోవడం వాస్తవమే కానీ అప్పటితో పోలిస్తే మరింత రాటుదేలాం’ అని అభిప్రాయపడ్డాడు.