భారత్, ఆసీస్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా, ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేసి 46 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మిచెల్ స్టార్క్ 112 బంతులు ఆడి 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. లంచ్ బ్రేక్ ముందు చివరి ఓవర్ వేసిన హర్షిత్ కు వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. కాగా చివరి వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తంటాలు పడ్డారు. భారత్‌పై ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో నాల్గవ అత్యల్ప స్కోరు.
ఐదు కీలక వికెట్లు తీసిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ స్టార్‌గా నిలిచాడు. హర్షిత్ రాణా మూడు, సిరాజ్ 2 వికెట్లు తీశారు. మొదటి రోజు ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, 2వ రోజు త్వరగా కారీని కోల్పోయింది. ఆ తర్వాత లియోన్ కూడా ఔటయ్యాడు, అయితే స్టార్క్, హేజిల్‌వుడ్ గట్టి ప్రతిఘటనతో తమ జట్టును 100 పరుగుల మార్కును దాటేలా చేశారు. అంతకుముందు, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నితీష్ రెడ్డి (41) టాప్ స్కోరర్‌తో బోర్డుపై 150 పరుగులు చేయగలిగింది.