calender_icon.png 23 February, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా

29-01-2025 12:29:12 AM

దుబాయ్: గతేడాది అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 2024 ఏడాదికి గానూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. భారత్ తరఫున సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకున్న ఐదో క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

బుమ్రా కంటే ముందు ద్రవిడ్ (2004), సచిన్ (2010), అశ్విన్ (2016), కోహ్లీ (2017, 2018) ఉన్నారు. ఇప్పటికే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన బుమ్రా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసి భారత్ కప్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

2024లో ఆడిన 13 టెస్టుల్లో బుమ్రా 77 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న బుమ్రా 907 రేటింగ్ పాయింట్లుకు సాధించి ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ సిరీస్ కోల్పోయినప్పటికీ  ఐదు టెస్టులు కలిపి 32 వికెట్లు పడగొట్టడం విశేషం.