ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్...
దుబాయ్: భారత స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్‌లోనే కొనసాగుతుండగా.. ఆల్‌రౌండర్ల కేటగిరీలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా (907 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ (841 పాయింట్లు), రబాడ (837 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. స్వదేశంలో వెస్టిండీస్‌పై విజయంలో కీలకపాత్ర పోషించిన పాక్ బౌలర్ నొమన్ అలీ (761 పాయింట్లు) తొలిసారి టాప్ ప్రవేశించాడు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా (400 పాయింట్లు) టాప్ స్థానాన్ని కాపాడుకోగా.. మార్కో జాన్సెన్ (294), మెహదీ హసన్ (263) రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు.