న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బు మ్రా బౌలింగ్‌లో తనకంటే వెయ్యి రెట్లు అద్బుతమైన బౌలర్ అని దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా భారత బౌలింగ్‌కు వెన్నుముకలా నిలుస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 4.08 ఎకానమీరేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో బుమ్రా మరోసారి కీలకమయ్యే అవకాశముందని కపిల్ వ్యాఖ్యానించాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ..“బుమ్రా నాకంటే వెయ్యిరెట్లు అద్భుతమైన బౌలర్. ఇప్పుడున్న క్రికెటర్లలో చాలా మంది మంచి నైపుణ్యం కలిగిన వారే. మనకు అనుభవం ఉంది.
వారు ఇంకా మెరుగవుతారు. ప్రస్తుత జట్టులో చాలా మంది నాణ్యమైన క్రికెట్ ఆడడంతో పాటు ఫిట్‌నెస్ విషయంలో చాలా ముందున్నారు. తీవ్రం గా శ్రమిస్తున్నారు. ఇలాగే కొనసాగితే గొప్ప క్రికెటర్లుగా కావడం పెద్ద కష్టమేం కాదు. ఇక ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు వ్యక్తిగతం కంటే జట్టుగా ఆడ డం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. అలా అయితే రెండోసారి చాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కోరిక నెరవేరుతుంది’అని కపిల్ వ్యాఖ్యానించాడు. ఇక 1983లో భారత్‌కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా నిలిచిన కపిల్ దేవ్ టెస్టుల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టాడు.