డిసెంబర్ నెలకు ఐసీసీ అవార్డుకు నామినేట్
దుబాయ్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా పేసర్ డేన్ పాటర్సన్ రేసులో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఆసీస్ పర్యటనలో మూడు టెస్టులు కలిపి 22 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు కలిపి 32 వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.
బ్రిస్బేన్, మెల్‌బోర్న్ టెస్టుల్లో వరుసగా తొమ్మిది వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్‌ను పోటీలోఉంచాడు. అయితే సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అనంతరం వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు రాలేదు. నొప్పి తీవ్రత ఎంత ఉందనేది రిపోర్ట్స్ వచ్చాకా తేలనుంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే చాన్స్ ఉంది.
బుమ్రాతో పాటు అవార్డుకు నామినేట్ అయిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్.. ఆస్ట్రేలియా 3 సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌తో సిరీస్‌లో తొలి మూడు టెస్టులు కలిపి 17 వికెట్లు తీసిన కమిన్స్ అడిలైడ్‌లో బౌలింగ్‌లో (5/57) సూపర్ స్పెల్‌తో మెరిసి జట్టుకు విక్టరీ అందించాడు.
ఇక శ్రీలంక, పాకిస్థాన్ లపై సౌతాఫ్రికా విజయం సాధించడంలో డేన్ పాటర్సన్‌దే కీలకపాత్ర. రెండు టెస్టులు కలి పి 13 వికెట్లు పడగొట్టిన పాటర్సన్ సౌ తాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.