టెస్టు క్రికెటర్ అవార్డు జాబితాలోనూ చోటు
దుబాయ్: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నామినేట్ అయ్యాడు. ఐసీసీ అవార్డుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డు (సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్)కు బుమ్రాతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన రూట్, బ్రూక్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ రేసులో ఉన్నారు.
దీంతో పాటు టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులోనూ బుమ్రా చోటు దక్కించుకోవడం విశేషం. రూట్, బ్రూక్‌తో పాటు కమిందు మెండిస్ (శ్రీలంక) రేసులో ఉన్నాడు. రీఎంట్రీ అనంతరం బుమ్రా చెలరేగిపోతున్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ గెలుచుకున్నాడు.
ఈ ఏడాది మొత్తంగా 13 టెస్టులు ఆడిన బుమ్రా 71 వికెట్లు పడగొట్టడం విశేషం. టీ20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన హెడ్ పోటీలో ఉండగా.. ఈ ఏడాది టెస్టుల్లో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శించిన రూట్ 17 టెస్టుల్లో 1556 పరుగులు సాధించాడు. ఇందులో ఆరుశతకాలు ఉన్నాయి.
లంక బ్యాటర్ కమిందు మెండిస్ కేవలం 9 టెస్టుల్లోనే 1049 పరుగులు సాధించి బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. పాకిస్థాన్‌తో టెస్టులో రూట్ (262 పరుగులు), బ్రూక్ (317 పరుగులు) బెస్ట్ ఇన్నింగ్స్‌లుగా ఐసీసీ అభివర్ణించింది. ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు రేసులో భారత్ నుంచి ఒక్కరికి చోటు దక్కలేదు.