బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. చివరి బంతికి ఉస్మాన్ ఖవాజా(2) ఔట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని ఆడబోయి స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో మొదటి రోజు ఆటను ఆసీస్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. మరోవైపు క్రీజులో కొన్ స్టాస్(07) ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్(Rishabh Pant) (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు స్కాట్ బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీసుకున్నాడు.