30-03-2025 06:20:33 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎడ్లబండ్ల ఊరేగింపును ఆయా కుల సంఘాల సభ్యులు ప్రారంభించారు. ఎడ్లబండ్లను అందంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఆలయాల చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.