calender_icon.png 23 December, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌పై బుల్లిష్

23-12-2024 12:35:49 AM

మోతీలాల్ ఓస్వాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్, నిఫ్టీ-50లు 8 శాతం పెరగడం ద్వారా 2024 క్యాలండర్ సంవత్సరంలోనూ భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ముగుస్తున్నదని, లాభాల్ని అందించడం ఇది వరుసగా తొమ్మిదవ సంవత్సరమని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ తాజా నోట్‌లో తెలిపింది.

విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా రూ.1.50 లక్షల కోట్ల విక్రయాలు జరపడంతో గత రెండు నెలల్లో మార్కెట్ దాదాపు 11 శాతం పతనాన్ని చవిచూసినప్పటికీ, మొత్తం సంవత్సరంలో ఈక్విటీలు లాభాల్ని ఆర్జించాయని వివరించింది. ఇక 2025లో భారత్ మార్కెట్ అంతర్జాతీయ, దేశీయ సంక్లిష్ట ఆర్థిక అంశాల నడుమ ప్రయాణం చేస్తుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.

యూఎస్ రేట్ల కోతల నడుమ డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని పేర్కొంది. మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయడంలో 2025 ఫిబ్రవరిలో వెలువడే కేంద్ర బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నది. ఈ అంశాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మార్కెట్ పరిమిత శ్రేణిలో కన్సాలిడేట్ అవుతుందని మోతీలాల్  ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ తన మార్కెట్ అవుట్‌లుక్‌లో అంచనా వేసింది. 

కరెక్షన్ కొనుగోళ్లకు అవకాశం

మార్కెట్లో జరిగిన తాజా కరెక్షన్‌తో లార్జ్‌క్యాప్ స్టాక్స్ విలువలు దిగివచ్చాయని, ఇది కొనుగోళ్లకు అవకాశమని,  అయితే మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు ఇంకా ప్రీమియం విలువలతో ట్రేడవుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. అందుచేత ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ స్టాక్స్ పట్ల ఓవర్‌వెయిట్‌తో ఉండవచ్చని సూచించింది.

తాము బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డిస్క్రీషనరీ, రియల్ ఎస్టేట్ రంగా ల పట్ల, క్యాపిటల్ మార్కెట్, డిజిటల్, ఈకామర్స్, హోటల్స్ థీమ్స్ పట్ల బుల్లిష్‌గా ఉన్న ట్లు తెలిపింది. మెటల్స్, ఎనర్జీ, ఆటోమొబైల్స్ స్టాక్స్‌పై అండర్‌వెయిట్ వ్యూహాన్ని కొనసాగిస్తామని వివరించింది. 

టాప్ స్టాక్ పిక్స్

మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ కొన్ని స్టాక్స్‌ను తన టాప్ పిక్స్‌గా ఎంపికచేసింది. అవి..ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, జొమాటో, నిప్పన్ ఇండియా లైఫ్, మ్యాన్‌కైండ్ ఫార్మా, లెమన్‌ట్రీ హోటల్స్, పాలీక్యాబ్ ఇండియా, మాక్రోటెక్ డెవలపర్స్.