మణిపూర్ మహిళల పోస్టుమార్టం నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు
మణిపూర్, నవంబర్ 24: మణిపూర్‌లో ఇటీవల కిడ్నాప్, అనంతరం హత్యకు గురైన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల పోస్ట్‌మార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. వీరిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు అందులో తేలింది. వారి మృతదేహాలపై బుల్లెట్ గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు.
బాలుడి కన్ను కనిపించకపోవడంతో పాటు అతని పుర్రెలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఛాతీపై దెబ్బలు, కత్తిగాట్లు, నుదిటిపైనా గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాలుడి తల్లి మృతదేహంపై 3 బుల్లెట్ గాయాలు ఉన్నాయని, చిన్నారి నానమ్మ శరీరంలో 5 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు.
మరో మహిళ, ఇద్దరు చిన్నారుల నివేదిక లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని జరిబామ్లో మైతీ తెగకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురిని నవంబర్ 11న దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారి శవాలు సమీపంలో నదిలో తేలియాడుతూ కనిపించాయి.