calender_icon.png 23 December, 2024 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు

03-11-2024 12:41:06 AM

ఢిల్లీ, నవంబర్ 2: దేశంలో వరుసగా బాంబు బెదిరింపుల నేపథ్యం లో తాజాగా ఓ విమానంలో పేలు డు పదార్థాలు దొరకడం కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో క్యాట్రిడ్జ్ (బుల్లెట్లు లోడ్ చేసే పరికరం) దొరకడం అనుమానాలకు తావిస్తోంది. అక్టోబర్ 27న వచ్చిన ఈ విమానంలో ఓ సీటులో క్యా ట్రిడ్జ్‌ను గుర్తించారు. కాగా ప్రయాణీకు లందరూ విమానం దిగిన తర్వాత  దీన్ని గుర్తించారు. గడిచిన 20 రోజు ల్లో మొత్తం 600కు పైగా విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.