మావోయిస్టుల ప్రకటన
పెద్దపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తున్నదని మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన జారీ చేసింది. గురువారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం విస్మరించి కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తుందని పేర్కొన్నరు.
అధికారంలో కి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఏడాది కావ స్తున్నా అమలు చేయలకపోగా ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధా నం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృ త పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు.
మూసి నది ప్రాంతంలో నివసిస్తున్న మ్రజలకు స్వచ్ఛమైన తాగునీరుఅందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాల పేరుతో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఈ ప్రభుత్వంకు ఎక్కడిదని ప్రశ్నించారు. విధ్వంస, అప్రజాస్వామిక పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ప్రజల చేతిలో తగిన మూల్యం చెల్లించక తప్పదని లేఖ ద్వారా హెచ్చరించారు.