calender_icon.png 28 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణతో వాణిజ్యానికి బల్గేరియా ఆసక్తి

28-11-2024 12:20:43 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణతో వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు బల్గేరియా ఆసక్తితో ఉందని భారత్‌లో ఆ దేశ రాయబారి నికోలాయ్ యాంకోవ్ తెలిపినట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో నికోలాయ్ యాంకోవ్ భేటీ అయ్యారు.

ఆ దేశపు కాన్సులేట్, సుచిర్ ఇండియా ఇన్ ఫ్రా సీఈవో డా. కిరణ్‌కుమార్ కూడా ఉన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఒక కామన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి అంగీకరించారు.

త్వరలో ఇరు దేశాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరపాలని కోరారు. మంత్రి ప్రతిపాదనకు నికోలాయ్ యాంకోవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయరమణారావు, సామెల్, పరిశ్రమల శాఖ కమిషనర్ మల్సూర్ పాల్గొన్నారు.