జంతువుల్లో హిప్పోలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇటీవల ఒక బుజ్జి హిప్పో అందరినీ అలరిస్తోంది. రెండు నెలల వయసున్న ఈ ఆడ పిగ్మీ హిప్పో పేరు మూ డెంగ్. ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు. ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని జూ చెబుతున్నారు.
అయితే నిద్రలో ఉన్న ఆ బుజ్జి హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. అందుకే దీని రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఏదేమైనా ఈ బుజ్జి హిప్పో నెట్టింట ఎంతోమందిని అలరిస్తోంది.