calender_icon.png 31 October, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమానుల మధ్యకు ‘బుజ్జి’

28-06-2024 12:05:00 AM

ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి2898ఏడీ’ గురువారం విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ప్రేక్షకుల సందడి నెలకొన్నది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేకంగా తయారు చేయించి, సినిమాలో ఉపయోగించిన ‘బుజ్జి’ వాహనాన్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు కల్కి మేకర్స్. దీంతో ప్రేక్షకులు బుజ్జి కారుతో కలిసి ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మరోవైపు ఈ సినిమాను తిలకించేందుకు నటి రేణు దేశాయ్ వీక్షించారు. కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ఆమె ప్రసాద్ ఐమాక్స్‌కు విచ్చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది రేణు దేశాయ్. ‘చాలా రోజుల తర్వాత ఓ సినిమా చూసి ఇంతలా ఎంజాయ్ చేశాం. నా గొంతు పోయేంతలా అరిచాను. మేము కల్కి మార్నింగ్ షోకి వెళ్లాం’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారామె.