- కామారెడ్డి గాంధీ గంజ్లో నిర్మించిన రైతుబజార్ షెడ్లు
- రోడ్లపై విక్రయిస్తూ ఇబ్బందులు పడుతున్న
- కూరగాయల రైతులు మార్కెట్ కమిటీ, మున్సిపల్
- శాఖల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపం
కామారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రైతులు రొడ్లపై కూరగాయలు విక్రయించ కుండా ఉండాలనే ఉద్దేశంతో కామారెడ్డి మార్కెట్ కమిటి ఆవరణలో రైతు బజార్ పేరిట 2019 లో పనులను ప్రారంభించారు. ఏడాదిలోనే పనులు పూర్తి చేశారు. రైతు బజార్ ను అందంగా తీర్చిదిద్దారు. రైతులు ఇబ్బందులు పడుతున్న తీరును చూసిన ప్రజాప్రతినిధులు రైతుల కష్టాలను తొలగించాలని సదుద్దేశంతో రైతు బజార్ నిర్మాణాన్ని కామారెడ్డి గాంధీ గంజిలో అరకోటి నిధులతో నిర్మించారు.
కూర గాయలు పండించిన రైతులకు కేటాయిం చాల్సి ఉండగా మార్కెట్ కమిటి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతులకు కేటాయించకపో వడంతో శాపంగా మారింది. రైతుల ప్రయోజనం కోసం 50 లక్షల నిధులతో 50 దుకాణాలలో కూరగాయలు, రైతులు విక్రయించేందుకు షెడ్లను నిర్మించారు. అప్పటి ప్రభుత్వ విఫ్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్ రైతుల ఇబ్బందులను చూసి వర్షానికి ఎండకు ఇబ్బంది పడకుండా రొడ్డుపైన విక్రయాలు చేపట్టకుండా ఉండాలని ఉద్దేశంతో రైతు బజార్ను నిర్మించారు.
కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి కూడా ఎలాంటి ట్రాపిక్ ఇబ్బందులు తలెత్తకుండా గాంధీ గంజ్ అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతో షెడ్లను నిర్మించారు. ప్రస్తుతం ఉన్న డైలీ మార్కెట్లో దుకాణాలు సరిపోక దుకాణాలన్నిటిలో కూడా మధ్య దళారీ కూరగాయల వ్యాపారుల అక్రమించుకోని రైతులను దుకాణ సముదాయాలలో కూర్చుని అమ్ముకొకుండా అడ్డు తగిలారు. దీనికి తోడు స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు దళారీ వ్యాపారులకు కొమ్ము కాయడంతో రైతులకు కేటాయించాల్సిన రైతు బజార్ దుకాణాలు ప్రస్తుతం వృథాగానే ఉంటున్నాయి.
కూరగాయలు విక్రయించే దళారి వ్యాపారులే రైతు బజార్లో సైతం అమ్ముకునేందుకు ప్రయత్నించగా రైతులు ఎదురు తిరిగారు. దీంతో మార్కెట్ కమిటి అధికారులు మున్సిపల్ అధికారులు లేని లొల్లి తమకు ఎందుకని ఉరుకున్నారు. ప్రస్తుతం కూరగాయల రైతులు సుభాష్రొడు,్డ డైలీ మార్కెట్ రొడ్డు, తిలక్ రొడ్డులో రొడ్డు పక్కన విక్రయాలు చేపడుతున్నారు. రోడ్డుపై కూరగాయలు విక్రయాలు చేపట్టడంతో ట్రాపిక్ సమస్య ఎదురవుతుంది.
నిత్యం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు కూరగాయల రైతులు ఎండలో కూర్చుండి విక్రయాలు చేపడుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం రైతు బజార్ షెడ్లను రైతులకు కేటాయించకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి.
కూరగాయలు రైతులు ఇతర గ్రామాల నుంచి వచ్చి కామారెడ్డిలో విక్రయిస్తున్నారు. వారికి కనీస వసతులైన నీరు, మూత్రశాలల సౌకర్యం లేకున్నా తైబజార్ వసూలు చేస్తున్నారు. ఒక్కో రైతు నుంచి 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కనీస వసతులు మాత్రం కల్పించడం లేదు.
ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి
కూరగాయల రైతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చొరవ తీసుకొని రైతులకు ఇబ్బందులు కల్గకుండా గాంధీ గంజ్లో నిర్మించిన రైతుబజారులో దుకాణాలను కూరగాయల రైతులకు కేటాయించాలని కొరుతున్నారు.ఎండకు వర్షాకాలంలో వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని రైతుబజార్ దుకాణా సము దాయాలను కూరగాయాల రైతులకు కేటాయించాలి.
లక్ష్మీ, మహిళా రైతు, లింగాపూర్, కామారెడ్డి
ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం
కామారెడ్డి మున్సిపల్కు తైబజార్ పన్ను చెల్లిస్తున్నాం. తమకు కనీస సౌకర్యాలు కూడా లేవు. నీరు లేదు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కొత్తగా నిర్మించిన గంజ్లో రైతు బజార్ సముదాయాన్ని రైతులకు కేటాయించాలి.
రాజమణి, మహిళా, రైతు, బస్వన్నపల్లి, కామారెడ్డి జిల్లా