calender_icon.png 12 January, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1,077 కోట్ల విలువైన భవనం బుగ్గి

12-01-2025 12:40:47 AM

  • లాస్ ఏంజెల్స్‌ను దహిస్తున్న కార్చిచ్చు
  • 11కు చేరిన మరణాల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం
  • హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

వాషింగ్టన్, జనవరి 11: లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు దహించివేస్తోంది. ఈ నెల 7న పుట్టుకొచ్చిన కార్చిచ్చు లాస్ ఏంజెల్స్‌లో సు మారు 35వేలకుపైగా ఎకరాలను బూడిద చేసింది. దీని వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11కు చేరింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు మం టలు వల్ల అక్కడి వాతావరణం తీవ్రం గా కలుషితమైనట్టు తెలుస్తోంది.

బూడిద, మసి, పొగ వాతావరణంలోకి చేరుతుండటంతో గాలి విషపూరితంగా మారినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో కాలిఫోర్నియా ప్రభుత్వం కార్చిచ్చు ప్రభావిత ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటల ను కేవలం 6శాతం మాత్రమే అదుపులోకి వచ్చింది. ఈటన్ ఫైర్‌ను నియంత్రించడానికి  అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ వారు ప్రయత్నాలు ఫలించడం లేదు. రాత్రిపూట వీచే బలమైన గాలులు తమ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

కోట్లు విలువైన భవనం అగ్గిపాలు

లుమినార్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రస్సెల్‌కు పాలిసిడ్స్‌లో అత్యంత ఖరీదైన భవంతి ఉంది. సుమారు 18 గదులుగల ఆ మాన్షన్ విలువ సుమారు 125 మిలియన్ డాలర్ల (రూ.1,077కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అంతటి ఖరీదైన భవనాన్ని కార్చిచ్చు బుగ్గి చేసింది. రస్సెల్ మాన్షిన్ కార్చిచ్చులో పూర్తిగా కాలిపోయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 

బాధితులను పరామర్శించిన ప్రిన్స్ హ్యరీ, మెఘన్

కార్చిచ్చు బాధితులను ప్రిన్స్ హ్యారీ దంపతులు పరామర్శించారు. పాసడే నాలోని ఆహార పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ప్రిన్స్ దంపతులు బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అండప్రిన్స్ దంపతులను నగర మేయర్ అభినందించారు.