calender_icon.png 28 February, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం

27-02-2025 10:20:14 PM

కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

శిథిలాల కింద చిక్కుకుని ఓ కార్మికునికి తీవ్ర గాయాలు

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. గురువారం సాయంత్రం నిర్మాణంలోని అడ్మినిస్ట్రేషన్‌ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తక్షణమే స్పందించిన తోటి కార్మికులు, సిబ్బంది వారిని బయటికి లాగారు. కాగా వీరిలో ఒక కార్మికునికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కార్మికుణ్ణి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారెమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు వర్శిటీ అధికారులు తెలియజేశారు