calender_icon.png 26 November, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తుకు అనుగుణంగా భవన నిర్మాణాలు ఉండాలి

26-11-2024 08:07:27 PM

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు (విజయక్రాంతి): భవిష్యత్తుకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అనుగుణంగా పవన నిర్మాణాలను చేపట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండల కేంద్రంలోని గుర్రంపోడు రోడ్డు నుండి కస్తూరిబా బాలికల విద్యాలయం వరకు 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు, మర్రిగూడ మండలం శివన్న గూడెంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, కొట్టాల గ్రామంలో 12 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడి సెంటర్ భవనానికి ఇరు మండలాల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.

శివన్నగూడెంలో త్వరలోనే మహిళా సమాఖ్య భవన్, సబ్ సెంటర్, రెండు అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని  భవన నిర్మాణాలు ఉంటాయని తెలిపారు. చర్లగూడెం రిజర్వాయర్ లో ముంపుకు గురైన నిర్వాసితులు బయట ఇల్లులు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని మర్రిగూడెం తహసిల్దార్, స్థానిక పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు. నాంపల్లి మండలం నాంపల్లి పట్టణ కేంద్రంలో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు ఎన్ని బ్రతికాయి అని ఉపాధి హామీ అధికారులను ఆరా తీశారు. దీంతో నాంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి 1600 మొక్కలు నాటామని అధికారులు తెలిపారు.