calender_icon.png 30 March, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో.. కుప్పకూలిన భవనం

27-03-2025 12:49:23 AM

ఆరుగురు కార్మికులు మృతి?

30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిపై ఐదంతస్తుల నిర్మాణం

భద్రాచలం, మార్చి 26: భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకొం ది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పోకలవారి వీధిలోని శ్రీపాద శ్రీపతి నిలయం పేరుతో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం బుధవా రం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఆ సమ యంలో ఆ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు పనిచేస్తున్నట్ల సమాచారం.

స్థానిక పంచాయతీ కార్యాలయ సమీపంలో 30 సంవత్సరాల క్రితం గ్రౌండ్‌ఫ్లోర్‌ను నిర్మించారు. దానికి వేసిన పిల్లర్లు 9అంగుళాలే. అవి కేవలం జీ ప్లస్ ఉపయోగించేవిగా ఉన్నవి. కాని ఇంటి యజమాని ఏకంగా జీ ప్లస్ భవనా న్ని అదే సన్నని పిల్లర్లపై ఎలాంటి గోడ లు నిర్మించకుండా స్లాబులు వేసుకుం టూ వెళ్లాడు. ఆ ఇంటి యజమాని ముస్లిం అయినా స్వామిజీగా అవతా రం ఎత్తాడు.

ఏవో విగ్రహాలు తెచ్చి పిల్లర్లకు అమర్చేందుకు బుధవారం పిల్లర్లకు బొక్కలు కొడుతున్న క్రమం లో ఒక్కసారిగా భవనం కుప్పకూలిం ది. భారీ భవనాలను అధునాతన సాం కేతికతను ఉపయోగించి కూలుస్తున్న చందాన ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని మృతిచెందినట్లు తెలుస్తోంది.

కాగా ఇంటి యజమాని భార్య మాత్రం ఇద్దరే పనికి వచ్చారని చెపుతున్నది. ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టారు. శిథిలాలను తొలగిస్తే ఎంతమంది కార్మికులు మృతి చెందారనేది తెలిసే అవకాశముంది. మృతిచెందిన వారిలో సంఘటన స్థలం వద్ద ఉన్న ద్విచక్ర వాహనాల ఆధారంగా భద్రాచలం పట్టణ పరిధిలోని లంబాడా కాలనీకి చెందిన వడిశాల ఉపేందర్, చల్ల కామేష్ ఉన్నట్టు తెలుస్తున్నది.

వారిద్దరూ తాపీ మేస్త్రీలని తెలుస్తోంది. భద్రాచలం ఆర్డీవో దామోదర్‌రావు, ఏఎస్పీ విక్రమ్‌కుమార్‌సింగ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజుతో పాటు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు

ఈ నిర్మాణంపై అనేకమార్లు గిరిజన సంఘాల నేతలు, స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారం రోజుల క్రితమే భవన నిర్మాణంపై కొందరు వీడియో తీశారు. ఇంత సన్నటి పిల్లర్లపై స్లాబులు వేస్తున్నారని, కూలిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తూ వీడియో చిత్రీకరించి విడుదల చేసినా అధికారులు పట్టించుకోలేదు.

వాస్తవానికి భద్రాచలం పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో కేవలం జీ ప్లస్ వరకే అనుమతులు ఇస్తారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరు. అయినా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు సాగుతున్నా పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. విజయక్రాంతి పలు కథానాలు ప్రచురించినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. 

అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య దిగ్భ్రాంతి

భవనం కూలి పలువురు మృతి పట్ల రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య తీవ్ర దిగ్బంతిని వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణంలో కుప్పకూలిన బిల్డింగ్ విషయంలో చేపడుతున్న సహాయ  చర్యలపై పూర్తి వివరాలు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.