సీనియర్ చికిత్స పర్యవేక్షకులు దేవ తిరుపతి
పెద్దపల్లి, డిసెంబర్ 27 (విజయక్రాంతి): క్షయ రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఈ పథకాన్ని దేశంలో 324 జిల్లాల్లో నిర్వహిస్తుందని, అందులో పెద్దపెల్లి జిల్లా ఉందని దానిని పెద్దపల్లి జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా టిబి సీనియర్ చికిత్స పర్యవేక్షకులు దేవ తిరుపతి తెలిపారు.
జిల్లాలోని రాఘవపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కొత్తపల్లిలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వం నిక్షయ్ శిబిర్ 100 రోజుల పథకంలో భాగంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆదేశాల మేరకు జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కెవి.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లో క్షయ శిబిరాన్ని నిర్వహించారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులలో స్క్రీనింగ్ పరీక్షలు, లక్షణాలున్న వారి నుండి కఫాన్ని సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో డిపిపిఎం కె.ప్రభాకర్, పి.శ్రీ హర్ష,హెఈఓ సాంబయ్య, తిరుపతమ్మ, ఏఎన్‌ఎం సరోజ, ఆశాలు సరోజ, స్వప్న గ్రామస్తులు పాల్గొన్నారు.