25-02-2025 11:50:53 PM
అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
అనుమతులను త్వరితగతిన పొందవచ్చు మేయర్, కమిషనర్
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఫాస్ట్ డ్రాయింగ్ స్క్రూటినీ సిస్టమ్ కోసం అధునాతన సాంకేతికతతో కూడిన యూనిఫైడ్ సింగిల్ విండో సిస్టమ్ అమలులో భాగంగా బిల్డ్‌నౌ శిక్షణ కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన ఫాస్ట్ డ్రాయింగ్ స్క్రూటిని సిస్టం ద్వారా నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం, వేగవంతమవుతుందని తెలిపారు. బిల్డ్ నౌతో నగర పౌరులు ఆన్ లైన్ లోనే తమ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ విధానం పారదర్శకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
నగర పౌరులకు, సంబంధిత అధికారులకు, ఆర్కిటెక్ట్ లకు, ఇంజనీర్లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని చెప్పారు. జీహెఎంసీ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ.. బిల్ట్‌నౌతో కొత్త ఫీచర్స్ తో నిర్మాణ అనుమతుల ప్రక్రియకు వన్ సింగిల్ ఫ్లాట్ ఫాంగా పనిచేస్తుందన్నారు. అప్లికేషన్స్, అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా;ఉంటుందని పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ మాట్లాడుతూ బిల్డ్ నౌ కొత్త సిస్టంతో భవన అనుమతిలో జాప్యం జరగకుండా ఉంటుందన్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ కొత్త సిస్టం ద్వారా నిర్మాణదారులకు ఒకే చోట త్వరితగతిన అనుమతులు పొందే అవకాశం ఉందని అన్నారు. బిల్డ్ నౌ పై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కోరారు.
సిసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ... బిల్డ్ నౌ శిక్షణ కార్యక్రమం మార్చి 9 వరకు ప్రతిరోజు రోజు రెండు సెషన్ లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బిల్డ్ నౌ డి.సి.ఆర్ వ్యవస్థ పై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడంతో పాటు భవన అనుమతుల ప్రక్రియలో క్రియేషన్ ఆఫ్ టెంపులేట్స్, లేయర్లు, వివిధ ఎంటిటి లను రూపొందించడం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, శివకుమార్ నాయుడు, అడిషనల్ సిసిపి లు గంగాధర్, ప్రదీప్, అర్కిటెక్ట్ లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.