calender_icon.png 22 December, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంతి భవనాలు నిర్మించండి

02-11-2024 11:41:20 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ విశ్రాంతి భవనాలు చాలినంతగా లేకపోవడం పెద్ద అసౌకర్యంగా ఉన్నది. అనేక పట్టణాలు, నగరాలు, ప్రాంతాలలో చాలామంది ప్రజలు వివిధ పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రైవేట్ లాడ్జింగుల్లో ఎక్కువ అద్దెకు గడపవలసి వస్తున్నది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలలో విశ్రాంతి భవనాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండడమేకాక కొన్ని చోట్లయితే అసలుకే లేవు. ్ర దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయ వనరు కూడా లభిస్తుంది. ప్రజలు ఎక్కువగా సందర్శించే వాణిజ్య, పర్యాటక, భక్తి ఆధ్యాత్మిక ప్రదేశాలలో, ఇంకా డిమాండ్ ఉన్న చోట్లలో ఈ విశ్రాంతి భవనాలు నిర్మించే ప్రతిపాదనలను ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకు నిధుల విడుదల, నిర్మాణ కార్యక్రమాలకు ప్రభుత్వం కావలసిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.

 షేక్ అస్లాం షరీఫ్