రాష్ట్రంలోని చాలాచోట్ల వాగులు, వంకలపై వంతెనలు నిర్మించవలసిన అవసరం చాలా ఉంది. ప్రతీ సంవత్సరం కురిసే భారీ వర్షాలు అనేక విషాదాలను మిగులుస్తున్నా పాలకులు, రాజకీయ నాయకులు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ఇటీవలి వర్షాలకు అనేక ప్రాంతాలలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్ అవుతున్న కారణంగా, వైద్య నిత్యావసరాల కోసం పడిగాపులు పడే దృశ్యాలు చాలా సహజమై పోతున్నాయి.
ప్రజాసంక్షేమం పేరుతో వేలకోట్ల రూపాయలు వెచ్చించే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల రాకపోకల కోసం కనీస రవాణా సదుపాయాల గురించి పట్టించుకోక పోవడం దురదృష్టకరం. ఆయా పల్లెలు, గ్రామాల్లో వంతెనల అవసరాన్ని ప్రభుత్వాలు తక్షణం గుర్తించి వాటి నిర్మాణాలు చేపట్టాలి. ఈ ఆధునిక యుగంలో రవాణా ఒక సమస్యగా, ఒక్కోసారి ప్రాణాపాయంగా ఉండడం సిగ్గు పడవలసిన విషయం.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్