calender_icon.png 1 April, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపైకి మురుగునీరు రాకుండా సైడ్ డ్రెయిన్ నిర్మించండి

24-03-2025 08:24:29 PM

భద్రాచలం జగదీష్ కాలనీ (ఎల్బీజీ నగర్) నందు స్థానిక సమస్యలపై సిపిఎం సర్వే..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం జగదీష్ కాలనీ శివారు ఎల్బీజీ నగర్ గుట్టపై గల ప్రాంతంలో డ్రైనేజీ నిర్మించకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపైకి వచ్చి తీవ్ర దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల ప్రజలు, పిల్లలు రోగాల బారిన పడుతున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. భద్రాచలం పట్టణం 19వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో జగదీష్ కాలనీ శివారు ప్రాంతంలో సిపిఎం బృందం సోమవారం స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ప్రజలు పలు రకాల సమస్యలు సర్వే బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది.

ఎల్బీజీ నగర్ శివారు లైన్ లో మిషన్ భగీరథ పైపులు వేయకపోవడంతో మంచినీరు అందడం లేదని వాపోయారు. వీధిలైట్లు వేయటం లేదని అన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇంటి పన్నులు తదితర సమస్యలు సర్వే బృందం దృష్టికి వారు తీసుకువచ్చారు. సిపిఎం సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రజల మద్దతుతో కృషి చేస్తామని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వార్డు కన్వీనర్ డి సీతాలక్ష్మి, శాఖ కార్యదర్శి డి రామకృష్ణ, కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.