- రామగుండంలో ప్లాంట్ జెన్‌కోకు అప్పగించాలి
- ఏపీ నుంచి రూ.3,352 కోట్లు రాష్ట్రానికి రావాలి
- డిప్యూటీ సీఎం భట్టికి పవర్ ఎంప్లాయిస్ జేఏసీ వినతి
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రామగుండలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మూసివేస్తున్న నేపథ్యంలో అందులోనే జెన్‌కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యు త్ కేంద్రాన్ని నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు డిప్యూటీ భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. బుధవా రం డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు విన తి పత్రాన్ని అందించారు. ప్రస్తుతం రామగుండంలో ఉన్న జెన్‌కో విద్యుత్ కేంద్రాన్ని మూసివేసి ఆ 540 ఎకరాల స్థలంలో జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఆ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
అంతేకాకుండా సుమారుగా 2,500 మంది ఉపాధి లభిస్తుందని తెలిపారు. జెన్‌కో ప్రాజెక్టులు ఈక్విటీ రూపంలో చెల్లించాల్సిన మొత్తం నుంచి సమకూర్చకోవచ్చన్నారు. సింగరేణి సంస్థలో 49 శాతం కేంద్రం, 51 శాతం రాష్ట్ర వాటా కలిగి ఉంద ని, జెన్‌కో మాత్రం వంద శాతం ర్రాష్ట ప్రభు త్వ రంగ సంస్థ అని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ ట్రస్ట్‌కు సంబంధించి తెలంగాణ జెన్‌కోకు ఏపీ జెన్కో నుంచి రూ. 2,478 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.914 కోట్లు, మొత్తం గా 3,392 కోట్లు రావాల్సి ఉందని తెలిపా రు. దీనిపై ఈ నెల 6న జరనున్న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించి ఇప్పించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన రూ.28,842 కోట్లు, వాటి నుంచి జెన్‌కోకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రావాల్సిన రూ. 9,500 కోట్లు రావాల్సి ఉందన్నారు. రామగుండంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి డెబిట్, ఈక్విటీ నిష్పత్తి 80:20గా ఉంటుందని, జెన్‌కో నుంచి ఈక్విటీని పెట్టుబడిగా పెట్టవచ్చని తెలిపారు. జెన్‌కో ఆర్థికప రంగా నూత న థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉన్నట్లు భట్టి చెప్పారు. విద్యు త్ ఇంజినీర్లు, ఉద్యోగులు, బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థలను బలోపేతం చేయటానికి అన్ని ప్రయాత్నాలు చేస్తుందన్నారు.