మునగాల: మండలంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఎస్ విద్యాసంస్థల చైర్మన్ రెడ్డి కోరారు. గత ఆరు నెలల కాలం నుంచి మునగల సీఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఎంజాయ్ నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు. రెండు మూడు రోజుల నుంచి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకొని కోర్టులో రిమాండ్ చేయడం అభినందనీయమన్నాడు. ఎందుకు గ్రామాల్లో యువత కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గంధం సైదులు, ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈఓ ఎస్ఎస్ రావు, మహేష్ పాల్గొన్నారు.