calender_icon.png 26 February, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

26-02-2025 08:31:16 PM

ఎంపీ గడ్డం వంశీకృష్ణ...

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని పురాతన శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆయన బుగ్గ దేవాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి రాజరాజేశ్వరునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంతో మహిమగల ఈ శైవ క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. తన పెదనాన్న గడ్డం వినోద్ భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కన్నాల నుండి దేవస్థానం వరకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ సహకారంతో బుగ్గ ప్రాంతాన్ని మరింత శోభాయమనంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వినోద్ స్పష్టం చేశారు.