25-02-2025 10:33:44 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయ(Sri Bugga Rajeshwara Swamy Temple) ప్రాంగణంలో నిర్వహించే బుగ్గ జాతరలో ప్రమాదం పొంచి కనిపిస్తుంది. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. జాతర కోసం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షామియాల కింద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. దాని చుట్టూ ప్రమాదాలు జరగకుండా కంచె ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎండోమెంట్ అధికారులు పట్టించుకోలేదు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇనుప విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ తాత్కాలిక కంచి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.