27-02-2025 08:28:33 PM
చిట్యాల: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పాడి గేదే మృతి చెందిన సంఘటన చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చల్లగరిగ గ్రామంలోని ఇంచర్ల లక్ష్మికి చెందిన పాడి గేదె మేత కోసం గురువారం ఉదయం గ్రామ శివారులోని సామల శ్రీహరి చేను వైపు వెళుతున్న క్రమంలో అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు గల ఎర్త్ వైరుకు తాకింది. ఈ క్రమంలో ఎర్త్ వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన గేదెకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.