28-04-2025 12:04:07 AM
కల్లూరు, ఏప్రిల్ 27 :-పేరువంచ గ్రామ పంచాయతీలోని మిషన్ భగీరథ గెట్ వాల్ గోయ్యి లో గేద పడి బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గమనించిన పశువుల యజమాని చుట్టుపక్కల వారి సహాయంతో బయటికి తీయడం జరిగింది.
ఆడుకునే పిల్లలు పెద్దలు ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ గేటు వాల్ గోతిలో పడకుండా ప్రమాదం జరగక ముందే మేల్కొని అధికారులు రక్షణ ఏర్పాటు చెయ్యాలని, పశువులు పడి,మురికి నీరు చేరి అట్టి కలుషితం గ్రామ ప్రజలు వాడుకోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. కాబట్టి సంబంధిత శాఖ వారు ఆ మిషన్ భగీరథ గెట్ వాల్ వద్ద రక్షణ ఏర్పాటు చేసి దానిపైన ఒక మూత ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నాను.