19-03-2025 01:28:23 AM
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ఉదయం 11.14 గంటలకు శాసనసభలో.. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండలిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టను న్నారు. రాష్ట్రప్రభుత్వం 2024-25లో రూ. 2.91 లక్షల కోట్లతో పద్దు ప్రవేశపెట్టగా, ఆ అంచనాలు తప్పాయి.
ఊహించిన స్థాయిలో ఆదాయం రాలేదు. గడిచిన పది నెలల్లో వచ్చిన ఆదాయంపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బేరీజు వేసుకుని 2025-26 పద్దును సిద్ధం చేసింది. గతేడాది కంటే ఈసారి 5శాతం వరకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చొప్పున పద్దు రూ.3.05 లక్షల కోట్ల నుంచి రూ.3.10 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
సర్కార్ పద్దు లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, విద్య, వైద్యంతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిసింది. ఆరుగ్యారెంటీల్లో భాగమై న పింఛన్ల పెంపు, మహిళలకు నెల కు రూ.2,500వంటి పథకాలు ఉం డే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ, బీసీ డిక్లరేషన్లకు ప్రాధాన్యం?
ఈ ఏడాది ప్రభుత్వానికి రైతు రుణామాఫీ భారం లేకపోవడంతో ఆ నిధులను ఇతర విభాగాలకు మళ్లించే అవకాశం కనిపిస్తున్నది. పద్దులో ఫ్యూచర్ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటా యని తెలిసింది. మహిళల కోసం భారీ కేటాయింపులు ఉండే అవకా శం ఉంది.
ప్రభుత్వం ఇప్పటికే కోటి మంది మహిలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రూ.20 వేల కోట్ల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కేటాయింపులు ఉంటా యి. గత ప్రభు త్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
నేటి ఉదయం క్యాబినెట్ భేటీ
బుధవారం ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ భేటీ కానున్నది. క్యాబినెట్ 2025- 26 బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్న ది. ఆతర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీ ఎం భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్‌బాబుపద్దును ప్రవేశపెట్టనున్నారు.