calender_icon.png 2 February, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్ సంకల్పానికి ప్రతీక బడ్జెట్

02-02-2025 12:13:30 AM

బీజేపీ రాష్ట్ర కోశాధికారి బీ శాంతికుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ కేవలం గణాంకాల పద్దు కాదని, అది ప్రధాని మోదీ దార్శనికతకు నిదర్శనమని, వికసిత్ భారత్ సంకల్పానికి ప్రతీక బీజేపీ రాష్ట్ర కోశాధికారి బీ శాంతికుమార్ కొనియాడారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. రైతు సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేసిందన్నారు.

యువత కోసం స్టార్టప్ రుణాలు, వేతన జీవులకు రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించిందని వెల్లడించారు. పెట్టుబడు లను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నదని వివరించారు. దేశంలో ప్రతిఒక్కరి కలను సాకారం చేసే విధంగా, భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా బడ్జెట్ ఉందని కొనియాడారు.